మీరు యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే అతి తక్కువ ధరకే కొనాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఆన్ లైన్ సేల్స్ ఫ్లాట్ ఫారం అయిన ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్‌పై ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 128జీబీ మోడల్ ఎంఆర్‌పీ రూ.79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ .77,400కు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారులకు రూ . 5000 ఆఫర్ కాగా, డివైజ్ బేస్ మోడల్ ధర రూ. 72,400కు తగ్గుతుంది.
ఇక పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై యూజర్లు రూ.20,500 వరకూ తగ్గింపు పొందుతారు. ఎక్స్ఛేంజ్ డీల్‌తో లేటెస్ట్ యాపిల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 51,900కు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 14ను పోలిన ఐఫోన్ 13ను కూడా తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్‌పై సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది.
ఐఫోన్ 14, ఐఫోన్ 13 రెండు స్మార్ట్‌ఫోన్లు యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్‌తో వెనుకభాగంగా 12 ఎంపీ కెమెరాలతో కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ముందు భాగంలో 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు ఇరు ఫోన్లు 5జీ, మ్యాగ్సేఫ్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉన్నాయి.