Home / INTERNATIONAL / కోర్టు మెట్లు ఎక్కనున్న ఎలన్ మస్క్

కోర్టు మెట్లు ఎక్కనున్న ఎలన్ మస్క్

ట్విట్ట‌ర్ ను హస్తగతం చేసుకున్న దాని ఓన‌ర్ అయిన ఎల‌న్ మ‌స్క్‌ కష్టాలు తప్పడం లేదు. ట్విట్టర్ ను చేపట్టిన మొదటి వారంలో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వచ్చారు ఎలన్ మస్క్. దీంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చిన చాలా మంది ఉద్యోగులు మస్క్ పై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దీంతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.తమను తొల‌గింపుల‌ను ప్ర‌శ్నిస్తూ మాజీ ఉద్యోగులు కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఆఫీసు రూమ్‌ల‌ను బెడ్‌రూమ్‌లుగా మారుస్తున్న‌ట్లుగా కూడా మ‌స్క్‌పై శాన్ ఫ్రాన్సిస్‌కోలో కేసు న‌మోదు అయ్యింది.

ముందుగా మ‌స్క్ హామీ ఇచ్చిన‌ట్లు త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం అంద‌డం లేద‌ని కొంద‌రు మాజీ ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీకి క‌ట్టుబ‌డి ప‌నిచేయాల‌ని మ‌స్క్ ఇచ్చిన అల్టిమేట‌మ్‌ను ప్ర‌శ్నిస్తూ కూడా కొంద‌రు కేసులు దాఖ‌లు చేస్తున్నారు. 60 రోజుల వార్నింగ్ టైమ్ ఇవ్వ‌కుండానే త‌మ‌ను తొల‌గించిన‌ట్లు కొంద‌రు కేసులు బుక్ చేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat