తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో జగపతి బాబు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఏమైంది ఈ వేళ .. బెంగాల్ టైగర్ లాంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాట కెకె రాధామోహన్ తన బ్యానర్ అయిన శ్రీసత్య సాయి ఆర్ట్స్ పతాకంపై ఆయుష్ శర్మ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీని నిర్మిస్తున్నారు.
కాత్యాయన్ శివపురి ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించిన విషయాన్ని నిన్న శుక్రవారం చిత్రం యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర కీలకంగా ఉంటుందని ఆ యూనిట్ తెలియజేసింది.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మూవీని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. సుశ్రీమిశ్రా ,విద్యా మాలపడే,జశ్విందర్ గార్డనర్,రాశుల్ టాండన్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా మెన్ గా జి శ్రీనివాసరెడ్డి.. విశాల్ తనిష్క్ ఇద్దరూ సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.