సినీ రాజకీయ క్రీడ రంగాలకు చెందిన ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ లో వెతకడం సర్వసాధారణం. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటెస్ట్ అందాల రాక్షసి హీరోయిన్ కత్రీన కైఫ్ గురించి తెగ వెతికారు అంట నెటీజన్లు.
ఇటీవల కత్రీన కైప్ కు వివాహం జరిగిన కానీ ఆ ముద్దుగుమ్మ క్రేజీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది గూగుల్ లో మోస్ట్ సెర్చ్ డ్ ఏషియన్ జాబితాలో కత్రీన కైప్ నాలుగో స్థానంలో నిలిచింది.
సినీ రంగం నుండి కత్రీన కైప్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం ఇక్కడ విశేషం . ఆ తర్వాత స్థానంలో మరో హీరోయిన్ ఆలియా భట్ ఉంది. ఆకట్టుకునే అందం .. చక్కని అభినయంతో పాటు తనదైన శైలీలో నృత్యాలతో యువతలో చెరగని పాలోయింగ్ ను సొంతం చేసుకుంది. గతేడాది యువహీరో విక్కీ కౌశల్ తో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.