Breaking News
Home / LIFE STYLE / ఈ ఎమోజీ లకు ఆర్ధం తెలుసా..?

ఈ ఎమోజీ లకు ఆర్ధం తెలుసా..?

వేల మాటల్లో చెప్పలేని భావాన్ని.. ఎమోజీ రూపంలో వెల్లడిస్తుంది స్మార్ట్‌ సమాజం. అవ్యక్త భావాలను వ్యక్తం చేయడానికి కూడా ఎన్నో ఎమోజీలు ఉన్నాయి. ప్రతి బొమ్మ వెనుకా స్పష్టమైన అర్థం ఉంటుంది. ఏదిపడితే అది వాడితే.. నవ్వులపాలే. కోర్టు కేసులకు దారితీసిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి, జాగ్రత్త.

బటర్‌ఫ్లై

బటర్‌ఫ్లై ఎమోజీ .. కొత్తగా ప్రారంభించడం, మార్పు దిశగా పయనించడం, సరికొత్త ఆశతో పని మొదలుపెట్టడం తదితర అర్థాలను సూచిస్తుంది. నిరాశ, నిస్పృహల్లో ఉన్న వ్యక్తికి బాసట ఇవ్వడానికి, ప్రేమను పంచడానికి ఈ ఎమోజీని వాడతారు. ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉన్నామనే వ్యక్తీకరణకూ ఇది సంకేతమే.

సెల్యూటింగ్‌ ఫేస్‌

ఎమోజీల జాబితాలో కొత్తగా కనిపిస్తున్నది సెల్యూటింగ్‌ ఫేస్‌. పైపైన చూస్తే గౌరవ సూచకమేమో అనుకుంటాం. దీనికి లోతైన అర్థం ఉంది. ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నాక.. ఇష్టానుసారంగా ఉద్యోగులను తీసేశాడు. ఈ సెల్యూటింగ్‌ ఫేస్‌ ఎమోజీని వీడ్కోలు, గౌరవప్రదమైన రాజీనామా, కంపెనీ పుట్టి మునిగిపోయిందని చెప్పడం.. ఇలా రకరకాల సందర్భాలలో వాడుతున్నారు.

డ్యాన్సింగ్‌ గాళ్‌

డ్యాన్సింగ్‌ గాళ్‌ ఎమోజీ ఎరుపు రంగు దుస్తుల్లో ఉంటుంది. సాల్సా చేస్తున్న అమ్మాయిని పోలిన ఈ ఎమోజీని పార్టీలు, పబ్‌లకు సూచనగా వాడతారు. ఎంజాయ్‌మెంట్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.

ఫైర్‌

హాట్‌గా ఉంది, కేకపుట్టిస్తుంది.. అనే భావం ఇందులో తొంగిచూస్తుంది. ఆడ,మగ ఇద్దర్నీ ఉద్దేశించి వాడతారు.

ఆక్టోపస్‌

ఎనిమిది కాళ్ల ఆక్టోపస్‌ను ఓ పట్టాన కౌగిలించుకోలేం. కానీ సోషల్‌ మీడియా దీనిని వెచ్చని కౌగిలింతకు, వర్చువల్‌ హగ్గుకు చిహ్నంగా వాడుతున్నది.

బేస్‌బాల్‌ క్యాప్‌

క్యాప్‌ అనే పదం Gen-Z యాసలో అబద్ధాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఔటింగ్‌కు వెళ్లినప్పుడు.. రహస్యంగా బాయ్‌ఫ్రెండ్‌ లేదా గాళ్‌ఫ్రెండ్‌తో సంభాషి స్తున్నప్పుడు వాడతారు. బేస్‌బాల్‌ క్యాప్‌ ఎమోజీని ఇచ్చారంటే.. అబద్ధం చెబుతున్నారని అర్థం.

పిజ్జా స్లైస్‌

పిజ్జా పీసెస్‌ ఎమోజీ ప్రేమను తెలియజేస్తుంది. తినడానికి సిద్ధంగా ఉన్నామని, ఎదుటివారిని కూడా రమ్మని ఆహ్వానించే సందర్భంలో వాడతారు.

బ్లూ సర్కిల్‌

ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్‌లో ప్రతి ఒక్కరికీ ‘బ్లూ-టిక్‌’ ఇస్తానని వాగ్దానం చేయడానికి ముందునుంచే ఈ బ్లూ సర్కిల్‌ ఎమోజీని వాడుతున్నారు. ఇది ఎవరికివారు అధికారికంగా ఇచ్చుకునే ధ్రువీకరణ. తమది నకిలీ అకౌంట్‌ కాదని చాటే ఎమోజీ.

ఓపెన్‌ హ్యాండ్స్‌

ఓపెన్‌ హ్యాండ్స్‌ ఎమోజీలు కౌగిలింతకు చిహ్నం. నిష్కపటమైన తత్వాన్ని పర్యాయంగానూ ఉపయోగిస్తారు.

జాగ్రత్త ..

☹ స్నో ఫ్లేక్‌ ఎమోజీ మనస్తాపానికి గురైన వ్యక్తికి సంకేతం. ‘కొకైన్‌’ తీసుకున్నామనే అర్థాన్నీ సూచిస్తుంది. ఇలాంటి ఎమోజీలతో సోషల్‌ మీడియా వేదికగా చట్టవిరుద్ధమైన వ్యాపారం జరుగుతున్నది.

☹ బ్రొకోలి ఎమోజీని కూడా అక్రమ లావాదేవీలకు, గంజాయి విక్రయానికి వాడతారు.

☹ పీచెస్‌ & బ్రింజాల్‌ ఎమోజీలు స్త్రీ, పురుషుల లైంగికతను సూచిస్తాయి. మహిళలపై వేధింపులు పెరిగిన కారణంగా.. వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.

☹ కార్న్‌ ఎమోజీ ముదురు రంగును సూచిస్తుంది. ఇది టిక్‌టాక్‌ వేదికగా ప్రసిద్ధి చెందింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అడల్ట్‌ కంటెంట్‌ను సూచిస్తుంది.

☹ ‘సుత్తి’ ఎమోజీ కూడా లైంగిక కార్యకలాపాలను సూచిస్తుంది.

☹ లోబ్‌స్టర్‌ ఎమోజీ.. లోబ్‌స్టర్‌ను మగ, ఆడ లక్షణాలు కలిగిన జీవిగా పరిగణిస్తారు. కాబట్టి, దీనిని ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ స్వీకరించింది.

-నమస్తే తెలంగాణ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat