తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది.
ఈ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాలి. కానీ మరో నెల రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని సమాచారం. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనుంది.