మెగాస్టార్ చిరంజీవి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో పనిచేసి ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు సాయం అందించడంలో ముందుండే మెగాస్టార్.. తాజాగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒకప్పటి కెమెరామన్ దేవరాజ్కు రూ.5 లక్షల సహాయం అందించారు. దేవరాజ్ చిరంజీవి నటించిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ సినిమాలకు పనిచేశారు.
