Home / MOVIES / సినీ ఇండస్ట్రీలో  మరో విషాదం

సినీ ఇండస్ట్రీలో  మరో విషాదం

సినీ ఇండస్ట్రీలో  వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన యువ నూతన దర్శకుడు   జోసెఫ్‌ మను జేమ్స్‌ (31)  అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్‌.. కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్‌  కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.

అయితే జోసెఫ్‌ మను ‘ఐయామ్‌ క్యూరియస్’   సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ 2004లో రిలీజైంది. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్‌ సినీపరిశ్రమ మీద ఉన్న ఆసక్తితో పలు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

‘నాన్సీ రాణి’   సినిమాతో పూర్తిస్థాయిలో దర్శకుడిగా పరిచయం కానున్నారు. తను తెరకెక్కించిన సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో అహానా క్రిష్ణ , అర్జున్‌ అశోకన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, తన తొలి సినిమా చూడకముందే జోసెఫ్‌ మరణించడంతో చిత్రయూనిట్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino