Politics ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని అందుకే ఇప్పుడు పనుల్లో జాప్యం జరుగుతుందని అన్నారు..
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ సీజన్లో ఎలాగైనా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని చెప్పుకొచ్చారు డయా ఫ్రమ్ వాల్ తప్పుగా వేయటం వల్లే ఇంత జాప్యం జరుగుతుందని అన్నారు దాని వలన ఇప్పుడు రిపేర్ చేయాల్సి వస్తుందని అన్నారు పోలవరంపై రాజకీయ ఆరోపణలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవగాహన లేకుండా తప్పులు చేశారని చెప్పుకొచ్చారు కాపాడడం పూర్తి చేయకుండా డయాఫ్రం వల్ల వేయటం వల్ల ఇంత నష్టం జరిగిందని అన్నారు..
అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ‘పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమే కారణం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాదు నిపుణులు చెప్తున్న మాట. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేసి ముందుకు వెళ్లాలి. అయితే వాటిని ఏ విధంగా రిపేర్ చేయాలో అధికారులు పరిశీలిస్తున్నారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకం. ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్‌లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.. ‘ అని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. అలాగే గతంలో వచ్చిన వరదలు సైతం పోలవరం ప్రాజెక్టును ఎంతగానో దెబ్బతీసాయని.. వీటన్నిటిని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు మరింత ఇబ్బంది కలుగుతుందని అన్నారు.. ఈ తప్పులన్నీటిని పోడ్చి ఎలాగైనా తొందర్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు..