Politics తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి పట్టణంలో జిల్లా సమైక్య దుకాణ సముదాయాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తుందని చెప్పుకొచ్చారు..
సంగారెడ్డి జిల్లాలో సమైక్య దుకాణ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ టిఎస్ ఐఎండీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా పేదల పెళ్లిళ్లకు రూ.1,00,116 ఇస్తున్నారన్నారు.
అలాగే తెలంగాణలో మహిళల సంక్షేమం కోసం ఇప్పటివరకు కేసీఆర్ అంతకన్నా కృషి చేశారని మహిళల పౌష్టికాహారం కోసం ఆరోగ్య లక్ష్మి అమ్మ ఒడి వంటి కార్యక్రమాలు తీసుకువచ్చారని కేటీఆర్ కిట్స్ సైతం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు సంగారెడ్డి జిల్లాలో 83 శాతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు గర్భిణీలో డెలివరీ అవుతున్నారని చెప్పుకొచ్చారు ప్రభుత్వ ఆసుపత్రిలో మునిపాటికంటే మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఏప్రిల్ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కి కూడా ఇవ్వనున్నట్లు చెప్పకు వచ్చారు ఈ కిట్లో తల్లికి అవసరమైన పౌష్టికాహారం మొత్తం ఉంటుందని తెలంగాణలో ఆరు లక్షల గర్భిణీలు ఏడాదికి రెండుసార్లు న్యూట్రిషన్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మాత శిశు మరణాలను తగ్గించేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారు హరీష్ రావు.. అలాగే మహిళల కోసం ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీరు ఇస్తున్నారన్నారు.