గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్ సంబంధ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వజీనాలో చెమటలు, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
☛ తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. శాని టైజర్ అందుబాటులో ఉంచుకోండి.
☛ ఈ దశలో వజీనాలో స్రావాల ఊట అధికంగా ఉంటుంది. దీంతో హానికర బ్యాక్టీరియా పోగవుతుంది. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధ్యమైనంత వరకూ తేమను పీల్చుకునే శక్తి ఉన్న కాటన్ లోదుస్తులే వేసుకోవాలి.
☛ రసాయనాలతో తయారు చేసిన లోషన్లతో వజీనా శుభ్రం చేసుకోవద్దు. జననాంగం నుంచి వచ్చే దుర్వాసననూ నిర్లక్ష్యం చేయకండి.
☛ కొందరిలో స్థనాల నుంచి ద్రవాలు విడుదల అవుతూ ఉంటాయి. ఆ అసౌకర్యాన్ని అధిగమించడానికి ప్యాడ్స్ ధరించవచ్చు. అంతేకానీ, మర్దన చేసుకోకూడదు. దీనివల్ల క్షీర గ్రంథులు మరింత చైతన్యవంతం అవుతాయి. ద్రవాల ఊట ఇంకొంత పెరుగుతుంది.
☛ ఆహారం విషయంలోనూ పరిశుభ్రత ముఖ్యం. వంట పాత్రలు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వంటకు ముందు కాయగూరలను నీళ్లలో కడగండి. వంటింట్లో చెత్త పోగు కాకుండా చూసుకోండి.
☛ కాలుష్యం లేని వాతావరణంలో ఇల్లు తీసుకోండి. ధూమపాన ప్రియులకు దూరంగా ఉండండి. హెయిర్‌డై, ఫ్లోర్ క్లీనర్స్ ఘాటు సైతం కాబోయే తల్లిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.