Home / LIFE STYLE / మీరు పగలు అతిగా నిద్రపోతున్నారా..?

మీరు పగలు అతిగా నిద్రపోతున్నారా..?

మీరు పగటి పూట అతిగా నిద్రపోతున్నారా..?. మీరు పగలు నిద్రపోకపోతే రోజు గడవదా..?. అయితే ఈ వార్త మీకొసమే. పగటి పూట నిద్రపోతే  రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్‌ () తాజాగా ప్రచురించింది.

బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్‌, ఉమెన్స్‌ దవాఖాన పరిశోధకులు 3,000కిపైగా వ్యక్తుల జీవనశైలిపై అధ్యయనం చేశారు. ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య సంబంధాన్ని పరిశోధించారు. మధ్యాహ్నం అరగంట కంటే ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో క్రమంగా డయాబెటిస్‌, హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉన్నదని పరిశోధనలో వెల్లడైంది.

నిద్రావస్థలో ఉన్నప్పుడు జీవక్రియలు మందగించటంతో దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉన్నదని తేలింది. నిత్యం 25-30 నిమిషాల కంటే ఎక్కువ కునుకు తీసే అలవాటు ఉంటే… ఇబ్బందులు తప్పవని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు తేలింది. లంచ్‌ తర్వాత కాసేపు నిద్రపోయే అలవాటు ఇతర దీర్ఘకాలిక రోగాలను ఆహ్వానిస్తున్నదని పరిశోధకులు చెప్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri