తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ డింపుల్ హయాతిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ PSలో క్రిమినల్ కేసు నమోదైంది.
హీరోయిన్ డింపుల్, హైదరాబాద్ నగర ట్రాఫిక్ DCP రాహుల్ జర్నలిస్ట్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. అయితే పార్క్ చేసిన రాహుల్ కారును డింపుల్, ఆమె ఫ్రెండ్ డేవిడ్ ఢీకొట్టారు.
దీంతో రాహుల్ డ్రైవర్, డింపుల్-డేవిడ్ మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే రాహుల్ కారును ఆమె కాలితో తన్నుతూ వీరంగం సృష్టించారు. డ్రైవర్ ఫిర్యాదుతో హీరోయిన్ డింపుల్, డేవిడ్ పై కేసు నమోదైంది.