యూపీ రాంపూర్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు అతన్ని మంచానికి కట్టేసి మరి ఆయన భార్య, 13 ఏళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్ చేసి పారిపోయారు.
భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొన్ని రోజుల కిందట సదరు వ్యక్తితో కొందరు గొడవపడ్డారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.