Breaking News
Home / MOVIES / కారు ప్రమాదానికి గురైన శర్వానంద్‌

కారు ప్రమాదానికి గురైన శర్వానంద్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆదివారం తెల్లవారు జామున శర్వానంద్‌ ప్రయాణిస్తున్న రేంజ్‌ రోవర్‌ కారు ఫిలింనగర్‌ జంక్షన్‌ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. శర్వానంద్‌ ప్రయాణిస్తున్న కారుకు బైక్‌ అడ్డు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

యాక్సిడెంట్‌ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్‌ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కాగా తాజాగా ఈ ప్రమాదంపై శర్వానంద్‌ టీమ్‌ స్పందించింది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేవని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino