Breaking News
Home / SLIDER / రిటైర్మెంట్ పై ధోనీ సంచలన వ్యాఖ్యలు

రిటైర్మెంట్ పై ధోనీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ కెరీర్‌కు స్వ‌స్తి ప‌లికేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ .. టీమిండియా లెజండ్రీ కెప్టెన్ మాజీ ఆటగాడు ఎంఎస్  ధోనీ  సిద్ధంగా ఉన్న‌ట్లు ఇటీవ‌ల కొన్ని సంకేతాలు అందిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌తో ఇబ్బందిప‌డ్డాడు.

అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జ‌ట్టు సొంతం చేసుకున్న‌ది. ఐపీఎల్ ట్రోఫీని అయిదోసారి గెలిచిన త‌ర్వాత ధోనీ మీడియాతో మాట్లాడారు.

ఆ స‌మ‌యంలో రిటైర్మెంట్‌పై అడిగిన ప్ర‌శ్న‌కు ధోనీ బ‌దులిచ్చాడు.తానేమీ ఇప్పుడే రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం లేద‌ని ధోనీ తెలిపాడు. 41 ఏళ్ల ధోనీ రాబోయే తొమ్మిది నెల‌లు త‌న ఫిట్‌నెస్‌పై ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. వీలైనంత వ‌ర‌కు వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్లు తెలిపాడు. త‌న అభిమానుల‌కు త‌న ఆట‌ను గిఫ్ట్‌గా ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino