Home / MOVIES / బాలకృష్ణ గురించి శ్రీలీల సంచలన వ్యాఖ్యలు

బాలకృష్ణ గురించి శ్రీలీల సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ హీరో.. నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో హాటెస్ట్ హీరోయిన్ క్రేజీ గర్ల్ శ్రీలీల బాలయ్య బాబుకు కూతురుగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఆ చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో బాబాయి కూతుళ్ల హంగామా మాములుగా లేదు.

  నందమూరి అభిమానులు కూడా ఆ పాటలోని వీరిద్దరి జోష్ కి ఫిదా అయ్యారు.  ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరోయిన్ శ్రీలీల తాను నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్‌ కేసరి’ కి సంబంధించిన పలు విశేషాలతో పాటు హీరో బాలయ్యతో తనకున్న అనుభవాల గురించి మాట్లాడుతూ తనసహచర నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి ఫిదా అయిపోయానని  అన్నారు.

ఇంకా శ్రీలీల మాట్లాడుతూ”“బాలకృష్ణ సార్‌ బయట వేరు, కెమెరాముందుకొస్తే వేరు. ఒక్కసారి పాత్రలోకి ఎంటరయ్యారంటే ఇక ఆయన భగవంత్‌ కేసరే.. బాలకృష్ణ కాదు. అంతగా పాత్రలో లీనమవుతారు. ఇందులో మా పాత్రల గురించి రివీల్‌ చేయడం నాకిష్టంలేదు. అయితే.. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఆయన నాకు సొంత బాబాయ్‌లాగే అనిపించారు. ఆయనకూడా లొకేషన్ లో నన్ను అలాగే చూసుకున్నారు. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్య సార్‌తో చేయాలనుంది.” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఈ హాట్ బ్యూటీ.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat