జమిలీ ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఒకరు క్లారిటీచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆయన క్లారిటీచ్చారు. అయితే త్వరలో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యధావిధిగా టైం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.
లోక్ సభ ఎన్నికలతో పాటు కలిపి జరిపే ఉద్ధేశ్యం తమకు లేదని ఆయన అన్నారు. పదవీ కాలం చివరి రోజు వరకు ప్రజలకు సేవ చేయాలన్నదే మోదీ లక్ష్యమని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.