Home / ANDHRAPRADESH / దత్తపుత్రుడి బాటలో బాబోరు..ఇక అత్తారింటికి ఇల్లరికం అల్లుడిగా

దత్తపుత్రుడి బాటలో బాబోరు..ఇక అత్తారింటికి ఇల్లరికం అల్లుడిగా

మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కుప్పంలో చిప్పతప్పదా…ఓటమి భయంతో చంద్రబాబు తన అత్తారింటికి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ బలంగా ఉన్న మరో నియోజవర్గంలో పోటీ చేయబోతున్నారా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి…టీడీపీ వర్గాలు. 14 ఏళ్లు సీఎంగా, ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కుప్పం ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. పోటీ చేసిన ప్రతీసారి గెలిపించారు. అయితే చంద్రబాబు సొంతూరు నారావారి పల్లె కూడా కుప్పంలోనే ఉంది…అయితే బాబుగారికి జన్మనిచ్చిన కుప్పం కంటే…అత్తారిల్లు అయిన ఉమ్మడి కృష్ణా జిల్లా అంటేనే మమకారం ఎక్కువ…ఎందుకంటే అక్కడ తన కులగణం ఎక్కువ కాబట్టి…అందుకే అధికారంలోకి రాగానే అక్కడే అమరావతిలో రాజధాని డిసైడ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తన సామాజికవర్గానికి దోచిపెట్టాలని ప్లాన్ చేశాడు..

అయితే ఈసారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేస్తున్నాడు..కానీ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరినప్పటి నుంచి బాబుగారికి వెన్నులో వణుకు పుడుతోంది..  బాబుగారు గల్లీ గల్లీ తిరిగి వంగి వంగి దండాలు పెట్టినా లాభం లేకపోయింది..అసలు దశాబ్దాలుగా అందలం ఎక్కించిన కుప్పంను చంద్రబాబు ఏనాడూ పట్టించుకున్నది లేదు..పాలనా కాలమంతటా హైదరాబాద్, ఆ తర్వాత అమరావతిలో తన కులపోళ్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా పని చేసిన చంద్రబాబు కుప్పంను సరిగా పట్టించుకున్నది లేదు…

30 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నా..కుప్పంలో అభివృద్ది శూన్యం…అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయింది…గత అసెంబ్లీ ఎన్నికల్లోనే చంద్రబాబుకు కుప్పం ప్రజలు చుక్కలు చూపించారు. వైసీపీ అభ్యర్థి ఎన్నికల టైమ్ లో అనారోగ్యంతో ఆస్పత్రి పాలై ప్రచారానికి దూరం అయ్యారు కాబట్టి సరిపోయింది..లేకుంటే కుప్పంలో చంద్రబాబు అప్పుడే ఓడిపోయి ఉండేవారు..అయితే వైనాట్ 175 అనే నినాదంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై చంద్రబాబు ఆగర్భ శత్రువు పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ,. ఇటీవల జరిగిన స్తానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ జెండా ఎగిరింది. దీంతో చంద్రబాబులో వణుకు మొదలైంది..

అందుకే కుప్పంలో ఓడిపోతే పరువు పోతుందనే భయంతో కాస్త ఫోకస్ పెట్టాడు..అంతే కాదు..ఎప్పుడూ చుట్టపుచూపుగా కుప్పంకు ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ఇక్కడ చిన్న బిల్డింగ్ కట్టుకుని..నేను లోకల్ అంటూ బిల్డప్పులు ఇస్తున్నాడు..అయినా చంద్రబాబుకు ఎక్కడో డౌట్ కొడుతొంది..స్వయంగా తన సొంతూరు నారావారిపల్లెలో వార్డులో వైసీపీ గెలిచింది. ఈసారి ఎలాగైనా కుప్పం నుంచి చంద్రబాబును తరిమికొట్టాలని మంత్రి పెద్దిరెడ్డి పంతం పట్టాడు. దీంతో బాబుగారికి కూడా భయం మొదలైంది..కుప్పంను నమ్ముకుంటే ఈసారి చిప్పే అని భావించిన చంద్రబాబు సేఫ్ సైడ్ గా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని డిసైట్ అయినట్లు సమాచారం..అది కూడా తన కులగణం ఎక్కువగా ఉన్న పెనమలూరు నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పెనమలూరు తెలుగు తమ్ముళ్లకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.

మొత్తంగా  చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో కుప్పంతో పాటు, పెనమలూరు నుంచి కూడా పోటీ చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.  చంద్రబాబు ఆల్రెడీ ఎన్టీఆర్ కుటుబానికి ఇల్లరికం అల్లుడిగానే వచ్చాడని అంటుంటారు..ఇప్పుడు తల్లిగారిల్లు అయిన కుప్పం ను వదిలి అత్తారిల్లు అయిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఇల్లరికం అల్లుడిగా పర్మినెంట్ గా వస్తాడా లేదా అన్నది చూడాలి..

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat