Breaking News
Home / MOVIES / టీమిండియా మాజీ కెప్టెన్ బయోపిక్ లో రామ్ చరణ్ తేజ్

టీమిండియా మాజీ కెప్టెన్ బయోపిక్ లో రామ్ చరణ్ తేజ్

పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయాలతో పాటు జాతీయ అవార్డులను గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌.. తాజాగా చరణ్ అందుకు తగ్గట్లు తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌ల ఎన్నిక విషయంలో ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా చెర్రీ  ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో  నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే రామ్‌చరణ్‌ విషయంలో ఆసక్తికరమైన ఓ వార్త ఫిలిం నగర్‌ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.తాను త్వరలో స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌కోహ్లీ బయోపిక్‌లో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ సినిమాను ఓ ప్రముఖ బాలీవుడ్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. విరాట్‌కోహ్లి బయోపిక్‌ గురించి గతంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. చాలామంది హీరోలు కూడా ఈ విషయంపై తెరపైకొచ్చారు. చివరకు విరాట్‌గా రామ్‌చరణ్‌ కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సంచలనంగా మారింది. విరాట్‌ కోహ్లి పుట్టినరోజైన నవంబర్‌ 5న ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన విడుదల కానుందని సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino