టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నదే జరిగింది..తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ చంద్రబాబు భయాందోళన చెందారు. జగన్ సర్కార్ కూడా చంద్రబాబు కోరుకున్నట్లే వ్యవహరించింది. తాజాగా : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు భారీగా చేరుకొని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు . చంద్రబాబును అరెస్ట్ చేయకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు . తమ నాయకుడు చంద్రబాబు విశ్రాంతిలో ఉన్నాడని, ఉదయం కలవండి అంటూ అధికారులతో టీడీపీ నాయకులు వాదించారు. ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబునుకలవాలని విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులు మాత్రం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులను పిలిపించారు. ఈ వెంటనే చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
టీడీపీ హయాంలో చంద్రబాబు సీఎం అయిన 2 నెలలకే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరుతో రూ. 371 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. షెల్ కంపెనీల ద్వారా రూ. 241 కోట్లు విదేశాలకు తరలించి, ఆ డబ్బు హవాలా రూపంలో తిరిగి బినామీల పేరుతో చంద్రబాబుకు చేరిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు కేబినెట్‌ను సైతం తప్పుదారిపట్టించి జీవోలో ఒకటి పెట్టి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి… డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. ఈడీ, సెబీతో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల దర్యాప్తులో స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ. 371 కోట్ల స్కామ్ జరిగిందని బయటపడింది..గత కొన్నాళ్లుగా దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ ఇప్పుడు పక్కా ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేసింది. మరి ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళతారా…లేదా వ్యవస్థలను అడ్డుకుపెట్టుకుని విచారణపై స్టేలు తెచ్చుకుని లేదా ముందస్తు బెయిల్ తెచ్చుకుని బయటపడతాడా అనేది చూడాలి. కాగా చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి..తమ్ముళ్లూ..నిప్పులాంటి నన్ను కూడా జైల్లో పెట్టి వేధించారంటూ…ఊరూరా తిరిగి సింపతీ డ్రామా ఆడేందుకు చంద్రబాబుకు ఇదే మంచి అవకాశమనే చెప్పాలి..అయితే ప్రజల్లో అన్నీ నమ్మే అవకాశం లేదు..సోషల్ మీడియా ముందు పచ్చ మీడియా కుప్పిగంతులు నడువవనే చెప్పాలి.