గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల్లో అవకతవకలు ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇటీవల తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే..
దీంతో గత సార్వత్రిక ఎన్నికల్లో బండ్ల చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి డీకే అరుణ కోర్టు తీర్పు నేపథ్యంలో తనను అధికారికంగా ఎమ్మెల్యేగా పదవీబాధ్యతలు అప్పగించాలంటూ..
తెలంగాణ స్పీకర్ కార్యాలయం చుట్టూ తిరుగుతుతున్నారు. ఇంకా హైకోర్టు నుంచి ఉత్తర్వులు కాపీలు అధికారికంగా అందని కారణంగా ఈ విషయంలో స్పీకర్ చాంబర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు..
ఈలోగా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దీంతో
ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తే రాబోయే ఎన్నికలలో అడ్వాంటేజ్ అవుతుందుకున్న డీకే అరుణ ఆశలు నెరవేరేలా లేవు..ఈ కేసుపై సుప్రీం కోర్టు తుది విచారణ జరిపి తీర్పు ఇచ్చేలోపు
తెలంగాణ అసెంబ్లీ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బండ్ల అనర్భత వేటుపై సుప్రీం స్టే విధించడంతో డికే అరుణ వర్గంలో నైరాశ్యం నెలకొంది.
