Home / ANDHRAPRADESH / రాజమండ్రి సెంట్రల్ జైలులోను బాబును వెంటాడుతున్న 23 సెంటిమెంట్..!

రాజమండ్రి సెంట్రల్ జైలులోను బాబును వెంటాడుతున్న 23 సెంటిమెంట్..!

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజులపాటు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే..
ఆదివారం 8 గంటల నుంచి మ. 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఈ మధ్యలో న్యాయమూర్తి రెండుసార్లు విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత ఓ గంటపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులను రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో తన ఉత్తర్వులను వెలువరించారు. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఓపెన్‌ కోర్టులో ఉత్తర్వులు చదివి వినిపించారు. దీంతో కోర్టు హాలులో ఉన్న చంద్రబాబుతో సహా టీడీపీ న్యాయవాదులంతా ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. కోర్టు హాలులో ఉన్న నారా లోకేష్‌ ముఖకవళికలు ఒక్కసారిగా మారిపోయాయి.

చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించాలని ఐసీబీ జడ్జి  పోలీసులను ఆదేశించారు. అక్కడ ఆయనను ప్రత్యేక గదిలో ఉంచాలని స్పష్టం చేశారు. జైలులో తగిన భద్రతను కూడా కల్పించాలని ఆదేశించారు. అయితే జైలు భోజనం కాకుండా  ఇంటి నుంచి భోజనం (చిప్పకూడు జస్ట్ మిస్ ), మెడిసిన్స్‌ తెప్పించుకునేందుకు అనుమతించారు. అయితే తాము దాఖలు చేసిన హౌస్‌ అరెస్ట్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని, అందువల్ల జైలుకు తరలించలేరని కొందరు టీడీపీ న్యాయవాదులు పోలీసులతో ఒకింత వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు మాత్రం కోర్టు వారెంట్‌ జారీ చేసిన నేపథ్యంలో జైలుకు తరలించి తీరాల్సిందేనని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడ కోర్టులోని మూడో అంతస్తు నుంచి లిఫ్ట్‌లో కిందకు తీసుకొచ్చి వాహనాల్లో రాజమండ్రి జైలుకు తీసుకెళ్లారు. అక్కడ జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గది కేటాయించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు సాధారణ ఖైదీలకు ఇచ్చే డ్రస్సు కాకుండా..ఆయనే రెగ్యులర్ దుస్తులు ధరించవచ్చు అని జైలు అధికారులు తెలిపారు..కోర్టు ఆదేశాల మేరకు జైల్లో ఇచ్చే ఆహారం కాకుండా…ఇంటి దగ్గర నుంచి భోజనం, మందులు తెప్పించుకునే సౌలభ్యం కల్పించార.

అయితే చంద్రబాబుకు జైలు ఇచ్చిన ఖైదీ నంబర్ 7691 పై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మీమ్స్, కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అధికారంలోకి ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కుని జగన్‌ దెబ్బ కొట్డడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు.. అయితే జగన్ కుంగిపోలేదు..బాబుకు టైమ్ వచ్చింది..కొట్టాడు..తీసుకున్నాడు..మా టైమ్ వచ్చినప్పుడు గట్టిగా కొడతాం అని వార్నింగ్ ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో సరిగ్గా ఎన్నికల్లో 23 సీట్లే గెలిచేలా చేసి..చంద్రబాబును చావుదెబ్బకొట్టాడు..అప్పటి నుంచి బాబును 23 సెంటిమెంట్ వదలడం లేదు…సరిగ్గా 2023 సంవత్సరంలో 09-09-23 తేదీన (ఈ అంకెలను కలిపితే 23 వస్తుంది) ..అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలులో అధికారులు చంద్రబాబుకు అలాట్ చేసిన ఖైదీ నంబర్ 7691 నంబర్ ని కూడితే సరిగ్గా 23 వస్తోంది.దీంతో చంద్రబాబుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పేలుతున్నాయి..ఏ జన్మలో చేసిన పాపం..ఆ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది.. ..సోనియాగాంధీతో కుమ్మక్కై..చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్‌ని 16 నెలలు జైల్లో పెట్టించి…లక్ష కోట్ల దొంగ, శుక్రవారం కోర్టు అంటూ చంద్రబాబుతో సహా పచ్చ మీడియా ఛానళ్లు, పత్రికలు పైశాచిక ఆనందాన్ని ప్రదర్శించాయి..ఇన్నాళ్లకు చంద్రబాబు చేసిన పాపాలు పండాయి..జగన్ తో నిమిత్తం లేకుండానే..ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేసి…20 కేసుల్లో జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న చంద్రబాబు ఇప్పుడు స్కిల్ కేసులో అడ్డంగా దొరికి రాజమండ్రి జైలులో చిప్పకూడు తినే పరిస్థితి వచ్చిందంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో చంద్రబాబును చెడుగుడు ఆడేసుకుంటున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat