Home / ANDHRAPRADESH / పురంధేశ్వరీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్..!

పురంధేశ్వరీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్..!

40 ఏళ్లుగా…దాదాపు 20 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయారు..ఆదివారం సాయంత్రం వరకు జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ…సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ పై ఆయనకు స్వయాన వదిన అయిన పురంధేశ్వరీ అన్యాయం, అక్రమం అంటూ ఆక్రోశించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్య ప్రసాద్, లంకా దినకర్ వంటి చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నేతలు తప్పా..మిగిలిన బీజేపీ నేతలు ఎవరూ..చంద్రబాబు అరెస్ట్ పై పెద్దగా స్పందించలేదు..కానీ చంద్రబాబు, తన తండ్రితో పాటు, తమకు వెన్నుపోటు పొడిన వైనాన్ని మర్చిపోయిన పురంధేశ్వరీ కుల పిచ్చి, బంధు ప్రీతితో ఈ మధ్య చంద్రబాబును మళ్లీ బీజేపీకి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాగా స్కిల్ స్కామ్ లో తన మరిది చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ తెగ బాధపడిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బీజేపీ దీనిని ఖండిస్తుందని పురంధేశ్వరీ ట్వీట్ చేశారు.

అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా టీడీపీ నేతల వ్యవహరిస్తున్నారంటూ పురంధేశ్వరీపై సోషల్ మీడియాలో నెట్‌జన్లు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర లేదంటే నమ్మలేమని కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వస్తే ఎందుకు స్పందించలేదని మరి కొందరు పురందేశ్వరిని సోషల్ మీడియా వేదికగా కడిగిపారేసారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించి ఆమె తన బంధు ప్రీతిని చాటుకున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అయితే చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరీకి షాక్ ఇచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ పై ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు రఘునందన్ రావు సూటిగా స్పందించారు. “ప్ర‌జాస్వామ్య దేశంలో గ‌తంలో కూడా చాలా మంది ముఖ్య‌మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధాన‌మంత్రులు, వారి కుటుంబ స‌భ్యులు అరెస్ట్ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏం జ‌రిగిందో నాకింకా తెలియ‌దు. కానీ రెండు మూడు నెలల్లో ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ వ‌స్తోంది. ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడై చంద్రబాబు అరెస్ట్ చేసే సాహ‌సం అక్కడి జగన్ సర్కార్ చేసిందంటే సాక్ష్యాలు, ఆధారాలు వుంటేనే చేస్తారు. అంతే త‌ప్ప ఎన్నిక‌ల ముందు ప్ర‌తిప‌క్ష నాయకుడిని అరెస్ట్ చేసి, వారికి సానుభూతి వ‌చ్చేలా చేసి తమ గొయ్యి తామే తీసుకుంటుందని నేను అనుకోనని రఘునందన్ రావు సమాధానం చెప్పారు. అంటే చంద్ర‌బాబునాయుడు త‌ప్పు చేశార‌ని, అవినీతికి సంబంధించి ఆధారాలు, సాక్ష్యాలు ప‌క‌డ్బందీగా పెట్టుకునే చేశారని, ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగం కాదనేలా రఘునందన్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పవచ్చు..ఇ

దిలా ఉంటే తనపై చంద్రబాబు కోవర్ట్ అనే ముద్రపడిపోతుందని భయమో..లేదా చంద్రబాబుతో మళ్లీ చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు క్లాసు తీసుకున్నారేమో కానీ.. పురంధేశ్వరీ…ఇవాళ చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంగా టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన బందుకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, తన పేరుతో బంద్ కు  పిలుపునిచ్చినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్‌పై తాను సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేస్తానని పురంధేశ్వరీ వెల్లడించారు. మొత్తంగా  చంద్ర‌బాబు అరెస్ట్ అక్రమం అంటూ కమ్మబంధంతో తెగ బాధపడిపోతున్న ఏపీ కాషాయ నేతల చెంప చెళ్లుమ‌నేలా ప్ర‌ముఖ న్యాయ‌వాది, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే అయిన ర‌ఘునంద‌న్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయనే చెప్పవచ్చు

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat