తెలంగాణ అధికార పార్టీ అయిన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో గులాబీ బాస్ కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తున్నారు.
ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలు విస్తృతంగా జనబాహుళ్యంలోకి వెళ్లాయి. బీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలపై ప్రజల్లో అమితాసక్తి, ఆమోదం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించే సభల విజయవంతానికి జడ్చర్ల ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి చామకూర మల్లారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.