తెలంగాణలో సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలం రంగం బంజార గ్రామం లో దేవి నవరాత్రులు సందర్బంగా ఈరోజు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పూజ కార్యక్రమం లో పాల్గొని, అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లోఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూనియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రతి గ్రామం లో మహిళా సోదరీమణులు అందరూ బతుకమ్మ ఆటలు అందరూ సంతోషంగా ఆడుతున్నారు. అని, మహిళలు అంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.
ఈ కార్యక్రమం లోఎంపీపీ దొడ్డ. శ్రీనివాసరావు,వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి. భద్రరాజు, బి. ఆర్. యస్ మండల అధ్యక్షులు రెడ్డం. వీరమోహన్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర. వెంకటలాల్, పట్టణ అధ్యక్షులు జి. వి. ఆర్, ఎంపీటీసీ బానోత్. మోహన్,సర్పంచ్ బాబు, మాజీ సర్పంచ్ లింగా,బి. ఆర్. యస్ నాయకులు సాగుర్తి. రామారావు, తదితరులు పాల్గొన్నారు