తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ గెలువడం ఖాయమన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మితే మొదటికే మోసం వస్తుందన్నారు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.
పార్టీలో చేరిన వారు వార్డు మెంబెర్స్ అందుగుల రవి,అండుగుల హరికృష్ణ, కార్యకర్తలు ఆందుగుల వెంకటయ్య, మరేపల్లీ కొండల్, బుడిపక వెంకన్న, పాల్వాయి నగేష్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గిరి సతీశ్, బీఆర్ఎస్ నాయకులు పొలగొని బుచ్చయ్య, అమరవాది ఇస్తారి, గునబోయిన జనార్దన్, నాయకులు పాల్గొన్నారు.