Home / SLIDER / కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్

కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ, మొత్తంగా పేదల వ్యతిరేక పార్టీ అని మరోసారి స్పష్టమైంది. రైతులు, దళితులకు ఆర్థిక సాంత్వన చేకూర్చేలా తీసుకొచ్చిన పథకాలను ఆపాలంటూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి తన నీచ బుద్ధిని బయట పెట్టుకుంది. రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న మొత్తాన్ని కూడా కాంగ్రెస్ అడ్డుకుంటోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు. కానీ తెలంగాణలో ఫేక్ హామీలిస్తూ.. మరోవైపు ఇలా తమ నీచ బుద్ధిని బయట పెట్టుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.

రైతులకు పంట పెట్టుబడికోసం.. పంట వేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ నీచ బుద్ధి ప్రదర్శించి రైతులకు పంటపెట్టబడి సాయం అందకుండా చేస్తోంది. పంట వేసే సమయంలో డబ్బులు అందకపోతే ఆ తర్వాత రైతుకు ఆ డబ్బులు ఇచ్చి కూడా వృథానే. చేతిలో డబ్బులు లేక పంట వేయడానికి రైతులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు రైతుబంధు వద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్. రేపటి రోజు వంట అమ్మిన ధాన్యం డబ్బులు కూడా అకౌంట్ లో వేయకుండా ఆపాలని ఫిర్యాదు చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైతుల మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ అలాంటిది. ఇప్పటికే రైతులకు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటూ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్పాడు. ఆ పార్టీ నాయకులంతా దీన్ని సమర్థించారు. ఇప్పుడు రైతుబంధును ఆపాలని అంటున్నారు. ప్రభుత్వం మీద ఉన్న కోపంతో రైతులపై కాంగ్రెస్ పార్టీ ముప్పేట దాడి చేస్తోంది. రైతులు కన్నీరు పెడుతుంటే దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందడం కాంగ్రెస్ పార్టీ నైజం. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మనం కర్ణాటకలో చూస్తున్నాం. రైతులు కరెంటు లేక పంటలకు నీళ్లందక ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. వారిని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చి అలవి గాని హామీలు ఇచ్చి ఇక్కడి ప్రజలను, రైతులను, సబ్బండ వర్గాలను మోసం చేయాలని కుట్రలు పన్నుతోంది.

మరోవైపు దళిత బిడ్డలను ఆదుకునేందుకు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని ఆపాలంటూ కాంగ్రెస్ నేత రాజకీయాలు చేయడం బాధాకరం. ఎన్నికల కంటే ముందు నుంచీ ఈ స్కీం ఉంది. చాలాకాలంగా ఇది కొనసాగుతోంది. అయినా కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా అడ్డుకోవాలని కుట్రలు చేస్తోంది. పథకాలను అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ రాక్షసానందం పొందుతోంది. మొత్తంగా తెలంగాణను ఆగం చేసి లాభం పొందాలని ప్రయత్నాలు చేస్తోంది. అలాగే దివ్యాంగులు వృద్ధులు, వితంతువుల పెన్షన్లను అడ్డుకోవాలని నీచాతినీచంగా ప్రయత్నాలు చేస్తోంది. కరోనా సమయంలోనూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెన్షన్లు ఆగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దివ్యాంగులు వృద్ధులు వితంతువులకు అండగా నిలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కరోనా వైరస్ కంటే దుర్మార్గంగా తయారైంది. అండగా ఉండాల్సింది పోయి వారి ఉసురుపోసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పార్టీకి ప్రజలు.. ముఖ్యంగా దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు, రైతులు గట్టిగా బుద్ధి చెప్పాలి. ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నాయకులకు చెప్పులు చీపురులతో బుద్ధి చెప్పాలి. గ్రామాల నుంచి తరిమికొట్టాలి. మా పెన్షన్లు, దళిత బంధు, రైతుబంధు ఆపేసి ఏ ముఖం పెట్టుకొని వచ్చారని నిలదీయాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat