Home / MOVIES / ఓటీటీలోకి స్కంద

ఓటీటీలోకి స్కంద

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ పోతినేని , మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం స్కంద ది అటాక‌ర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్‌లో ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయిపోయింది.

లాంగ్‌ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద‌.. ఆ తర్వాత పట్టుమని పది కోట్ల గ్రాస్‌ కూడా కలెక్ట్‌ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో న‌వంబ‌ర్ 02 నుంచి స్కంద స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు. మరీ సినిమా రిజల్ట్‌ చూసి.. సీక్వెల్ ఆలోచనను పక్కన పెట్టేస్తారా.. లేదంటే తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat