తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఖమ్మం నగరంలో వచ్చే నెల ఐదవ తేదీన జరిగే బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”విజయవంతం కావడానికి తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.ఖమ్మంలో ఐదవ తేదీ సాయంత్రం జరిగే బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు”ప్రజా ఆశీర్వాద సభ”ను దిగ్విజయం చేయడంలో భాగంగా తెలంగాణ భవన్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యాన శనివారం సన్నాహాక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,పాలేరు శుక్రవారం బీఆర్ఎస్ సభ బ్రహ్మాండంగా జరిగిందని,దానిని మించి ఖమ్మం మీటింగ్ సెక్సెస్ కావడానికి తన వంతుగా కామేపల్లి మండలం నుంచి 5,000మంది హాజరయ్యేలా చూస్తానని హామీనిచ్చారు.భారీ బహిరంగ సభలకు హాజరయ్యే అశేష ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవలసిందిగా ఎంపీ వద్దిరాజు సలహాలిచ్చారు.
ఈ సన్నాహాక సమావేశంలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ వైరా,మధిర,పాలేరు నియోజకవర్గ అభ్యర్థులు బానోతు మదన్ లాల్,లింగాల కమల్ రాజు,కందాళ ఉపేందర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.