కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని 127- రంగారెడ్డి నగర్ డివిజన్ ఎన్.ఆర్. ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన శాంతి ఆరాధన చర్చ, పాస్టర్ సైమన్ రాజు గారి అధ్వర్యంలో పీస్ వర్షిప్ చర్చ్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను గంగా జమున తహేజీబ్ అనే నానుడిని నిజం చేస్తూ బిఆర్ఎస్ పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ నిరుపేదలైన క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ గిఫ్ట్స్, ముస్లిం సోదరుల కోసం రంజాన్ తోఫా, హిందూ మహిళల కోసం బతుకమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టిన ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
అంతేకాక ప్రార్థన మందిరాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించిన ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ పార్టీయేనన్నారు.అనంతరం వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారికే తమ పూర్తి మద్దతు ఉంటుందని క్రిస్టియన్ సోదర, సోదరీమణులు తమ పూర్తి మద్దతును తెలియజేశారు.