ధర్మపురి నియోజకవర్గంలో ఎస్సి కుటుంబాలందరికి దళిత బందు అమలు చేస్తామని సీ ఎం కేసీఆర్ చేసిన ప్రకటన చాలా గొప్పదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ధర్మపురి నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద యాత్ర సభను విజయ వంతం చేసిన ప్రకజలకు ధన్యవాదములు చెప్పారు. శుక్రవారం ధర్మపురి లో ఎన్నికల కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. దళితులందరికి దళిత బందు అమలు చేస్తామని ప్రకటించిన్నప్పటి నుంచి నా సంతోషానికి అవధుల్లేవాన్నారు.
ధర్మపురి ప్రజల తరపున సీఎం కేసీఆర్ కు పాదాబీ వందనాలు చేస్తున్నాని చెప్పారు. కేసీఆర్ ఒక మాట చెప్పారంటే అది రామబాణం లాంటిదన్నారు. కేసీఆర్ చేస్తా అన్న పని చేస్తారు..వీపు చూపరన్నారు. తెలంగాణ రాష్ట్రం తెస్తా అంటే తీసుకు వచ్చి చూపించారన్నారు.ఇప్పుడు కూడా హామీ ఇచ్చారంటే నిలుపు కుంటారని.. హుజురా బాద్ లో అమలు చేసి చూపించారన్నారు. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదన్నారు. గత పాలకులు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు.
ఏనాడూ ఎస్సీల అభివృద్ధి కి కృషి చేయలేదన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకుండానే..ఏ రాష్ట్రంలో లేని విధంగా బందు తీసుకు వచ్చారని చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో 20 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరూతుందన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యంగా దళితులు అర్ధం చేసుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం గట్టి ఋణం తీర్చు కోవాలని కొప్పుల ఈశ్వర్ కోరారు.ఈ సమావేశం లో మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బలరాం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.