కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ శ్రీ కే.ఎం పాండు గారి 5వ వర్ధంతి సందర్భంగా చింతల్ లోని ఎమ్మేల్యే కార్యాలయం వద్ద ఈరోజు మాజీ కార్పొరేటర్ కే ఎమ్ గౌరిష్ గారు నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి ఎన్నో సేవలు అందించిన కే.ఎం పాండు గారు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని, నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడ్డ మహనీయులు పాండు గారు అని అన్నారు. వారి ఆశయాలు మన అందరికీ ఆచరణీయం అని, వారు నిర్దేశించిన మార్గాన్ని అనుసరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టి లక్ష్మారెడ్డి, కృష్ణమూర్తి, బలరాం రెడ్డి, సత్తిరెడ్డి, సురేందర్ రెడ్డి, ఆంజనేయులు, కే రవీందర్ ముదిరాజ్, మురళి, గణేష్, నాగరాజ్, మహిళా నాయకురాలు ఇంద్రారెడ్డి, శివ పార్వతి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.