131 – కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో 129 సంజయ్ గాంధీ నగర్ కు చెందిన టిడిపి కంటెస్టెడ్ కౌన్సిలర్ దొరల్ల నారాయణ తో పాటు పలువురు పురుషులు, మహిళలతో పాటు 300 మంది ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ అభివృద్ధిని కొనసాగించడంలో సీనియర్ నాయకులు నారాయణ లాంటి వ్యక్తులతో పాటు మహిళా శక్తి కీలకమని, గత తొమ్మిదేళ్లుగా కుత్బుల్లాపూర్ లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించి మేనిఫెస్టో ద్వారా మరో ఐదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారీ మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు : భద్రప్ప, విజయలక్ష్మి, లావణ్య, మహబూబ్ బీ, సత్యవతి, సువర్ణ, లక్ష్మీనారాయణ, ఎల్లయ్య, రజిత, రాధిక లతో పాటు 300 మంది మహిళలు, యువకులు..