తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనలో శ్రీ బండి పార్థసారధి రెడ్డి గారు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామం నుంచి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి పనితీరుకు ఆకర్షితులై 12 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.వారిని బండి పార్థసారధి రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మేకా చెన్నారెడ్డి గారు, జగ్గవరపు వెంకటరెడ్డి గారు, జగ్గవరపు చెన్నారెడ్డి గారు, గొర్ల మారి సుధాకర్ రెడ్డి గారు, కొలికపోగు సిద్దయ్యగారు, బాలమర్తీ వేణు, ఇడుపులపాటి మనోజ్ , మనోహర్ , కొలికపోగు వీర్రాజు, ఆయనంపూడి శేషు, కంచర్ల రాఘవేంద్ర, అద్దేపల్లి సుధీర్ , బాలమర్తి సతీష్ లను బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఎమ్మెల్యే గారు అభినందించారు. వీరి చెరికతో కొత్తూరులో బిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అయిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తూరు ఉమా గారు, హరికృష్ణ రెడ్డి గారు, దొడ్డ శంకర్రావు గారు, జడ్పిటిసి రామారావు గారు, మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు, గొర్ల సంజీవరెడ్డి గారు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీను గారు మరియు కొత్తూరు టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.