జగద్గిరిగుట్ట డివిజన్లో ఉప్పర (సగర) సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉప్పర (సగర) సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మాణం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ 30 లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉప్పర సంఘం సభ్యుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం పని చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీయేనన్నారు. మన సంక్షేమం ఆలోచించే నాయకుడు కెసిఆర్ మార్గదర్శకత్వం లోని బిఆర్ఎస్ పార్టీని ముచ్చటగా మూడవసారి భారీ మెజార్టీతో గెలిపించాలని సంఘ సభ్యులను కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య, సగర సంగం అధ్యక్షులు ఆర్.కే. దయాసాగర్, కార్యదర్శి ఆస్కాని శ్రీనివాస్ సాగర్, కోశాధికారి వీ. సుదర్శన్, సభ్యులు ఎం. రాములు, ఏ. కొండయ్య సాగర్, ఎన్. రామకృష్ణ, బాలరాజ్, జి. సత్యనారాయణ, కె.పి. రాములు, డి. గోపాల్, బి. శ్రీరాములు, సీహెచ్. శ్రీనివాస్, గంగాధర్, సగర సంగం మహిళ అధ్యక్షురాలు ఏ. తిరుపతమ్మ, ప్రధాన కార్యదర్శి ఆర్.డి శాంతి, కోశాధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు.