సత్తుపల్లి నియోజకవర్గ హెటిరో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హెటిరో అధినేత ఖమ్మం రాజ్యసభ సభ్యులు డా. బండి పార్థసారథి రెడ్డి గారు.వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో సాయిబాబా ఫంక్షన్ హాల్ యందు జరిగిన సత్తుపల్లి నియోజకవర్గ హెటిరో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న హెటిరో అధినేత ఖమ్మం రాజ్యసభ సభ్యులు అధినేత డా.బండి పార్థసారధి రెడ్డి గారు…
తదనంతరం మాట్లాడుతూ …నియోజకవర్గంలో నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలలో మమేకమై ఒక సామాన్య కార్యకర్తగా నియోజక అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రాబోవు నూతన ప్రభుత్వంలో కేసిఆర్ అమలు చేసే అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల మేనిఫెస్టోను వివరించారు.
ప్రతి ఒక్కరు ఈ పది రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని గడపగడపకు తిరుగుతు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించాలని తెలుపుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు