భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలిత స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షంతో వారికి ఘన స్వాగతం పలికారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పినపాక నియోజకవర్గం లోని అన్ని గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందాయని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని అభివృద్ధి సంక్షేమని కొనసాగించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు, బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రూ.5016కు, దివ్యాంగులకు పెన్షన్ 6 వేలకు పెంచుతామన్నారు.
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు అర్హులైన పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు, ఈనెల 30వ తేదీన జరిగే పోలింగ్ లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు, సీఎం కేసీఆర్ గారు దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకాన్ని తెచ్చి పది లక్షల రూపాయలు అందజేస్తున్నారని చెప్పారు ఎన్నికలు పూర్తికాగానే హుజురాబాద్ తరహాలో పినపాక నియోజకవర్గం లోని ప్రతి కుటుంబానికి దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ గారు హామీ ఇచ్చారని కచ్చితంగా ఇస్తామని ఆయన చెప్పారు…