కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోని దివిటిపల్లి, అంబటిపల్లి గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దివిటిపల్లి ఎలా ఉండేది, నేడు ఎలా మారిందో మీ కళ్లముందే కనిపిస్తుందన్నారు. ఐటీ పార్కుతోపాటు మరిన్ని కంపెనీలు వస్తున్నాయని, దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
డబుల్‌బెడ్రూం ఇండ్లు, బీటీ రోడ్డుతోపాటు భవిష్యత్‌లో మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎన్నికల సమయంలో మోసం చేసే నాయకులు వస్తుంటారు, పోతుంటారని, ప్రజల మధ్య ఎవరుండి అభివృద్ధి చేస్తారో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కుల,మత రాజకీయాలు చేస్తారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధు బంద్ చేయించారన్నారు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, కష్టాల్లో పలుపంచుకునే బీఆర్‌ఎస్‌ను ఆదరింఆలని పిలుపునిచ్చారు.