తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్భుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి… ఎమ్మెల్యే గారి నివాసం వద్ద జరిగిన చేరికల కార్యక్రమంలో 130-సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఒరిస్సా యువజన సంఘం సభ్యులు పలువురు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది విధానం ద్వారా మన రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శిగా మారిందన్నారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో నేడు దేశ తలసరి ఆదాయాన్ని మించిన ఆదాయంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాము..
అభివృద్ధిని ఇలాగే కొనసాగించేందుకు కెసిఆర్ సారు మళ్లీ మూడవ సారి ముఖ్యమంత్రి కావాలన్నారు. కాబట్టి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ముచ్చటగా మూడవ నెంబర్ పై ఓటు వేసి గెలిపించాలన్నారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారు: పంచు, సుబ్రత్, అనిరుధ్, నిమైహ, జగన్, సాహో, గణేష్ లు…ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.