చింతల్లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కుత్బుల్లాపూర్ రజక సంఘం అధ్యక్షులు సింగారం మల్లేష్ గారి అధ్వర్యంలో నిర్వహించిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బీసీ బందు కార్యక్రమాన్ని పెట్టిందని, ఈ పథకం ద్వారా రజకులకు వ్యాపార అభివృద్ధి నిమిత్తం లక్ష రూపాయల రుణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందజేస్తూ వారి అభ్యున్నతికి కృషిచేసిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీయేనన్నారు. అంతేకాక నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో రజకుల సంక్షేమానికి అధునాతనమైన దోబీ ఘాట్ నిర్మాణం చేపట్టామని రానున్న రోజుల్లో రజకులకు మరిన్ని దోబీ ఘాట్ లు ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బిక్షపతి, ఆంజనేయులు, బాలయ్య, బాచుపల్లి వెంకటేష్, పురుషోత్తం, నరసయ్య, యాదగిరి, విటల్, రజక సంఘాల నాయకులు సోమశేఖర్, సత్యనారాయణ, యాదగిరి, నరేష్, స్వామి, రాజు, చంద్రం, శంకర్, సాయిబాబా, కృష్ణమూర్తి, సోమయ్య, నరసయ్య, చంద్రమౌళి, బాలయ్య, నర్సింగ్ రావు, సత్తయ్య, సత్యనారాయణ, శ్రీను, వీరయ్య, రాక స్వామి, బాలరాజు, శ్రీనివాసరావు, సత్తయ్య, మరియు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.