ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లో ఎంతో ఆదరణ పొందుతూ.. విజయవంతంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తన పాదయాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మంగళవారం తన పాదయాత్రతో నెల్లూరులోకి ఎంటరయ్యాడరు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనీల్ వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఇలా ప్రజల అండదండలతో.. ప్రజల ఆదరణ పొందుతూ విజయవంతంగా కొనసాగుతున్న జగన్ పాదయాత్ర ఇప్పుడు అధికార పార్టీ నాయకుల్లో గుబులు రేపుతోంది.
ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సైకిల్ యాత్ర చేస్తానంటున్నారు. ఇంతకీ ఆ మంత్రి సైకిల్ యాత్ర చేసే అవసరమేముందీ అనుకుంటున్నారా..? సీఎం చంద్రబాబు నాలుగేళ్లు గడిచినా ఇంకా డిజైన్ల ఎంపికలోనే ఉంటూ ప్రజలను కన్ఫూజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రజల సంక్షేమంలోనూ టీడీపీ ప్రభుత్వం వెనుకపడింది. అటు పింఛన్ల విషయం, మరో వైపు నిరుద్యోగ సమస్య, పోలవరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారం, విజయవాడ ఆలయంలో క్షుద్రపూజలు, మహిళలపై టీడీపీ ఎమ్మెల్యేల దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏర్పడానికి కారణాలు కోకొల్లలు.
ఇలా అనేక సమస్యలతో రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టడమే కష్టం అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణుక్యతకు పదునుపెట్టి మరీ లోకేష్‌ను.. జగన్‌మోహన్‌రెడ్డికి ధీటుగా బరిలోకి దింపనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు పోటీగా.. లోకేష్‌తో సైకిల్ యాత్ర చేయించాలనే ఆలోచనలో ఉందట టీడీపీ మంత్రివర్గం.