అనుకున్నదే అయింది. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. త్వరలోనే తన రాజీనామా లేఖను స్పీకర్‌ను అందజేస్తానని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే తనకు గౌరవముందని.. కాంగ్రెస్ పార్టీని విమర్శించనని తెలిపారు. ప్రజలు కోరుకుంటే మునుగోడు నుంచే మళ్లీ పోటీ చేస్తానన్నారు. …
Read More »భూ సర్వే.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి మండల కేంద్రంలో శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జగన్ మాట్లాడారు. ‘జగనన్న భూరక్ష’ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ట్రైబ్యునళ్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూసర్వేలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం ఉండాలని సీఎం ఆదేశించారు. మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఉండాలని.. …
Read More »మోదీ బాటలోనే వారంతా.. మరి మీరు..?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కావున నేటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా మొదలైన సోషల్ మీడియా ఎకౌంట్‌లలో జాతీయ జెండాను డీపీగా పెట్టాలని సూచించారు. తాజాగా మోదీ …
Read More »వావ్.. అర్జున్‌రెడ్డి ఇదేం క్రేజ్‌రా బాబోయ్..!
ఎన్నో సినిమాలు చేసి సూపర్‌హిట్‌లు కొడితేగాని దక్కని క్రేజ్ అర్జున్‌రెడ్డి మూవీతో సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అందులోనూ ఓ సినిమా రిలీజ్‌కు ముందు టాలీవుడ్ హీరో బాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అలాంటిది మన లైగర్ హీరోకు ముంబయిలోని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ …
Read More »మూవీ ఇండ్రస్ట్రీలో గందరగోళం ఎందుకంటే..!
సినీ పరిశ్రమలో గందరగోళం నెలకొంది. మూవీ ఇండ్రస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కొన్ని రోజులు షూటింగ్స్ నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూషర్ కౌన్సిల్ దీనికి అంగీకారం తెలిపింది. ఆ పిలుపుతో కొన్ని సినిమాలు షూటింగ్‌లు నిలిపివేయగా కొన్ని ఆగలేదు. ఇతర భాషా సినిమాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని కేవలం తెలుగు సినిమాల షూటింగ్‌లు మాత్రమే నిలిపివేయాలని కోరినట్లు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూషర్ కౌన్సిల్ అధ్యక్షుడు …
Read More »ఎన్టీఆర్ కుమార్తె సూసైడ్ చేసుకున్నారా?
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి సూసైడ్ చేసుకుని చనిపోయిందంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ వద్దకు ఆమె సోదరులు రామకృష్ణ, బాలకృష్ణతో …
Read More »రోడ్డు యాక్సిడెంట్‌లో కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె మృతి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. తానియాతో పాటు ప్రమాణిస్తున్న ఆమె స్నేహితులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ పరిధిలోని శాంతంరాయి వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో …
Read More »ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ జయసారథి ఇకలేరు
ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణం, భక్త కన్నప్ప, పరమానందయ్య శిష్యుల కథ, మన …
Read More »విసుగెత్తిపోయిన చైతూ.. సమంత వల్లేనా..!
మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా పేరు తెచ్చుకున్న చై,సామ్‌లు విడిపోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సామరస్యంగా విడిపోతున్నామంటూ ఇరువురు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంటపై విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వల్ల చై, సామ్‌లు నెట్టింట మళ్లీ హాట్ టాపిక్‌గా నిలిచారు. వీటన్నింటికి విసుగెత్తిపోయిన చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ …
Read More »హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. ట్రాఫిక్‌జామ్
హైదరాబాద్‌లో నేడు మళ్లీ భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం వల్ల ప్రధాన రహదారుల్లోకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మూసాపేట్, కోఠి, మలక్‌పేట్, కూకట్‌పల్లి, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అబిడ్స్, నారాయణగూడ, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్‌లో వర్షం భారీగా కురిసింది. ఎల్‌బీనగర్, వనస్థలీపురం తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Read More »