Home / POLITICS / అనుకున్నదే అయింది.. కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై!

అనుకున్నదే అయింది.. కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై!

అనుకున్నదే అయింది. కాంగ్రెస్‌ పార్టీకి ఆ పార్టీ సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. త్వరలోనే తన రాజీనామా లేఖను స్పీకర్‌ను అందజేస్తానని చెప్పారు.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అంటే తనకు గౌరవముందని.. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించనని తెలిపారు. ప్రజలు కోరుకుంటే మునుగోడు నుంచే మళ్లీ పోటీ చేస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే మోదీ, అమిత్‌షాతోనే సాధ్యమనని చెప్పారు. బీజేపీలో చేరాలనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అభిమానులు, ముఖ్యనాయకులతో చర్చించి త్వరలో నిర్ణయం వెల్లడించానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar