తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి విదితమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు,కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం …
Read More »కమల్ హాసన్ గర్వపడేలా నటించాడు-బీజేపీ నేత వీడియోపై మంత్రి కేటీఆర్ ట్వీట్
మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన యాక్టింగ్‌పై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీజేపీ నాయకుల డ్రామాకు సంబంధించిన వీడియోను తన ట్వీట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు. బీజేపీ నాయకుల డ్రామాను ఈ దేశ ప్రజలు తప్పక చూడాలి. పోలింగ్ స్టేషన్‌లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని పోలీసులు సూచించినందుకు.. బీజేపీ నాయకుడు ఒకరు హంగామా సృష్టించారు. …
Read More »కేవీ స్కూళ్లలో ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4014 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను డిపార్ట్‌మెంట్ …
Read More »భారతీయులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయులపై ప్రశంసలు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులు అని అన్నారు. అభివృద్ధి అంశంలో భారత్ ఎనలేని ప్రగతిని సాధిస్తుందని ఆయన తెలిపారు. శుక్రవారం యూనిటీ డే సందర్భంగా రష్యన్ భాషలో పుతిన్ మాట్లాడారు. ఆ ప్రసంగంలో భారత్‌ను విశేషంగా పుతిన్ కొనియాడారు. అభివృద్ధి విషయంలో భారత్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని, ఆ దేశంలో 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, అదే వాళ్ల సామర్థ్యం అని …
Read More »రాహుల్ గాంధీపై కేసు నమోదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టింది.యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్-2 హిందీ సినిమా పాటలు, …
Read More »బీజేపీ నెక్స్ టార్గెట్‌గా జార్ఖండ్
కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్‌లోని హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) …
Read More »కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. నవంబర్ 7న ఈడీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. శివకుమార్‌తోపాటు ఆయన సోదరుడు కనకపుర ఎంపీ డీకే సురేశ్‌కు కూడా తాఖీదులు ఇచ్చింది. ఇదే కేసులో సోదరులిద్దని గత నెల 7న ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది.తనకు, తన సోదరునికి ఈడీ నోటీలు అందాయని శివకుమార్ చెప్పారు. …
Read More »భారతీయులకు ఎలాన్ మస్క్ షాక్
ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ యాజమాన్యం కింద ఉద్యోగాల కోత భారీస్థాయిలో కొనసాగుతున్నది. భారత్‌లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 3,700 పైచిలుకు ఉద్యోగాలు ఊడిపోతాయని అంచనా వేస్తున్నారు.
Read More »డిసెంబర్ 4న హన్సిక వివాహం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తార హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాల్య స్నేహితుడు సొహైల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది. తనకు కాబోయే భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరికీ సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట దర్శనమిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సొహైల్, హన్సిక ఇద్దరూ కలిసి బోటులో షికారు చేస్తున్న ఫొటో ఒకటి …
Read More »