నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. నవంబర్ 7న ఈడీ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. శివకుమార్‌తోపాటు ఆయన సోదరుడు కనకపుర ఎంపీ డీకే సురేశ్‌కు కూడా తాఖీదులు ఇచ్చింది. ఇదే కేసులో సోదరులిద్దని గత నెల 7న ఈడీ విచారించింది. తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది.తనకు, తన సోదరునికి ఈడీ నోటీలు అందాయని శివకుమార్ చెప్పారు. అయితే సోమవారం తాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాల్సి ఉన్నదని వెల్లడించారు. విచారణకు హాజరవ్వాలా వద్ద అనే విషయంపై నేడు నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.
Bengaluru | My brother & I have been summoned. I'm looking at it. I'm occupied with our national president's programs on Nov 7. I'll take a decision on it today: Karnataka Cong chief DK Shivakumar on ED's summons asking him to appear before it on Nov 7 in a money laundering case pic.twitter.com/ftWrdsHJGh
— ANI (@ANI) November 5, 2022