Home / rameshbabu (page 551)

rameshbabu

ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి-WHO

ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్యదేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.

Read More »

తెలంగాణలో కొత్తగా 184 మందికి కరోనా వైరస్

తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,236 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 184 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒకరు మృతి చెందారు. వైరస్ నుంచి 137 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,75,798కి చేరింది. మృతుల సంఖ్య 3,990కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,581 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

Read More »

పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ఆ Star Hero

Tollywood Youth Icon స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప. డిసెంబర్ 17న రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అదే నెల 12న నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో జరిపే ఈ ఫంక్షన్కు పుష్ప మేకర్స్ ప్రభాసు అతిథిగా ఆహ్వానించారని తెలుస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఈవెంటికి వస్తే.. సినిమాకు కలిసొచ్చే అంశమని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై …

Read More »

మాళవికా మోహనన్ కి గాయాలు

కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ ఓ సినిమా షూటింగులో గాయపడింది. ఈ కేరళ భామ చేతికి, ఈ కాలికి దెబ్బలు తగిలాయి. ఈ ఫోటోలను మాళవికా సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ బాలీవుడ్ మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆమె చేతికి గాయమైందట. ఇక, సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన మాళవికా.. విజయ్ ‘మాస్టర్’ చిత్రంలో సందడి చేసింది.

Read More »

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం నిధులు విడుదల

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి సంబంధించి 2016-17 నుంచి 2019-20 సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్న రూ.372.34 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం 2007 నుంచి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం వాటా కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర …

Read More »

న్యూజిలాండ్ తో రెండో టెస్టుకు 25 శాతం మందికే అనుమతి

న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు.. లిమిటెడ్గానే ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని ముంబయి క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలో 33 వేలున్న వాంఖడే స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మ్యాచ్ నిర్వహించనున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య.. డిసెంబరు 3 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Read More »

కిడ్నీలను సేఫ్ గా  ఉంచే సూపర్ ఫుడ్ ఇదే!

కిడ్నీలను సేఫ్ గా  ఉంచే సూపర్ ఫుడ్ ఇదే! రోజూ ఒక ఆపిల్ తింటే కిడ్నీలకు చాలా మంచిది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కాన్బెర్రీలు కిడ్నీని కాపాడటంలో బెస్ట్. ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్కి కిడ్నీలో రాళ్లను తొలగించే శక్తి ఉంటుంది. క్యాబేజీలో సోడియం తక్కువ.. కిడ్నీ వ్యాధులను నిరోధిస్తుంది. చిలగడదుంప, కాకరకాయ కూడా కిడ్నీకి మేలు చేసేవే. కీరదోస, వాటర్మెలన్ వంటివి క్రమం తప్పకుండా తినాలి. కొబ్బరినీళ్లు కిడ్నీలకు …

Read More »

రైతు వేదికలు…. చైతన్య దీపికలు- ఎమ్మెల్యే అరూరి….

రైతులంతా ఒక్కతాటిపై నడవాలి… సంఘటితమవ్వాలి… చైతన్యవంతులు కావాలి… లాభసాటి వ్యవసాయం చేయాలి… అందుకు ఒక వేదిక కావాలి… అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు.కాజిపేట మండలం మడికొండ, కడిపికొండ క్లస్టర్ల పరిధిలో 44లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, మేయర్ గుండు సుధారాణి గార్లతో …

Read More »

రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు.

రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి. అంటూ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎం పీ లు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, …

Read More »

12దేశాల్లో రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్

కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్) మరికొన్ని దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకు 12 దేశాల్లో ఈ కేసులను గుర్తించారు. సౌతాఫ్రికా, బోట్స్వానా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే చాలా దేశాలు ముందుజాగ్రత్తగా ఇతర దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat