కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. బుధవారం పద్మారావు గౌడ్, సతీమణి స్వరూప సికింద్రాబాద్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ ను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అమోఘమని అన్నారు. వ్యాక్సిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Read More »దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మల్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,407 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,56,923కి చేరింది. ఇక నిన్న 89 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,435కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,73,413 యాక్టివ్ కేసులున్నాయి
Read More »తప్పులో కాలేసిన కీర్తి సురేష్
కరోనా తర్వాత విడుదలైన క్రాక్ మూవీలో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ చిత్రంలో అమ్మడు నటించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టిన రోజు అనుకుని మహానటి.. తెలుగు సినిమా ప్రేక్షకుల కలల రాకూమారి అయిన నటి కీర్తి సురేశ్ తప్పులో కాలేసింది. నటి వరలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో పొరపాటు …
Read More »ఆచార్య మూవీపై అందాల బ్యూటీ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు, చరణ్.. ఇద్దరిపై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చరణ్ కు జోడీ పూజా హెగ్లో నటించనుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా …
Read More »30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
టీమిండియాతో అహ్మదాబాద్ లో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. 30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిబ్లీ (2), క్రాలే (9)ను అక్షర్ పటేల్ పెవీలియన్‌కు పంపగా.. రూట్ (5)ను సిరాజ్ ఔట్ చేశాడు. మూడో టెస్టు తరహాలోనే ఈ టెస్టు కోసం కూడా పిచన్ను స్పిన్ కు అనుకూలంగా తయారుచేయించినట్లు కన్పిస్తోంది
Read More »రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి : మంత్రి కేటీఆర్
ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉసురు తీసి మరోవైపు ఉత్తరాల పేరుతో బీజేపీ డ్రామాలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని …
Read More »ఢిల్లీలో బీజేపీకి షాక్
ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం కొనసాగించింది. 5 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో.. 4 వార్డులను ఆప్ కైవసం చేసుకోగా.. ఓ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి ఇదో సందేశమని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. సీఎం అరవింద్ …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ0 నుండి పోటీ చేస్తున్న మాజీ ప్రదాని పి.వి. నర్సింహరావు కుమార్తె సురభి వాణీ దేవి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ మందా జగన్నాథ0 అన్నారు.శాంతి నగర్ లోని వడ్డేపల్లి మాజీ జడ్పిటిసీ శ్రీనివాసులు స్వగృహంలో టి ఆర్ ఎస్ నాయకులు మందా శ్రీనాథ్, వడ్డేపల్లి …
Read More »బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర
ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటిఐఆర్ ని రద్దు …
Read More »వరంగల్ హీరోయిన్ ఈషా రెబ్బ సంచలన నిర్ణయం
టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో సమంత అక్కినేని లీడ్ రోల్ పోషిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. శాకుంతలంలో వరంగల్ అమ్మడు ఈషా రెబ్బా కీ రోల్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈషారెబ్బ శాకుంతలం ప్రాజెక్టుకు నుంచి తప్పుకున్నట్టు న్యూస్ ఫిలింసర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. తన రోల్‌కు మేకర్స్ ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ …
Read More »