Home / SLIDER / రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీజేపీ క్ష‌మాప‌ణ చెప్పాలి : మ‌ంత్రి కేటీఆర్

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీజేపీ క్ష‌మాప‌ణ చెప్పాలి : మ‌ంత్రి కేటీఆర్

ఒక‌వైపు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉసురు తీసి మ‌రోవైపు ఉత్త‌రాల పేరుతో బీజేపీ డ్రామాల‌కు పాల్ప‌డుతుంద‌ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని ధ్వజమెత్తారు. లేఖ రాయాల్సింది రాష్ట్ర ప్ర‌భుత్వానికి కాద‌ని కేంద్రంలో ఉన్న త‌న సొంత ప్ర‌భుత్వానికి అన్నారు. పలుమార్లు పార్లమెంట్ సాక్షిగా ఐటీఐఆర్‌ని రద్దు చేస్తున్నామని ప్రకటించిన కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్‌కి లేఖ రాసి నిజాలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. బండి సంజయ్‌కి హితవు పలికారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంతటి అబద్ధాల‌నైనా మాట్లాడే నైజం బీజేపీద‌న్నారు.

విచిత్రం, విడ్డూరం, పచ్చి అబద్దం..

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందేన‌న్నారు. జూన్ 2014లో అంటే తెలంగాణ వచ్చిన మొదటి నెలలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీఐఆర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారన్నది వాస్తవం అన్నారు. మళ్లీ 2014 సెప్టెంబర్ లో పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమొరాండం సమర్పించామని, దీంతోపాటు అనేకసార్లు ప్రధానికి, కేంద్ర ఐటీ శాఖ మంత్రికి విజ్ఞప్తులు తమ ప్రభుత్వం తరఫున స్వయంగా తానే అందించానని కేటీఆర్ తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన ఐటీఐఆర్ అమలు కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అనడం విచిత్రం, విడ్డూరం, పచ్చి అబద్దం అన్నారు.

దీనికి కార‌ణం కేసీఆర్ ప్ర‌భుత్వ‌మేనా..?

ఒక్క తెలంగాణలోనే కాదు ఐటీఐఆర్ మంజూరైన ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్న సంగతి తెలియకపోవడం తెలంగాణ బీజేపీ అధ్యక్షుని అజ్ఞానాన్ని సూచిస్తుందన్నారు. అటు కేంద్రంలో ఇటు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ బెంగళూరు ఐటీఐఆర్ ప్రాజెక్టులో ఒక తట్టెడు మట్టి కూడా తీయ‌లేద‌న్న వాస్త‌వం గ్ర‌హించాల‌న్నారు. క‌ర్ణాట‌క‌, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో కూడా ఐటీఐఆర్ మొదలు కాకపోవడానికి కూడా కారణం కేసీఆర్ ప్రభుత్వమేనా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడనికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అని ముందుగా ఆ విషయాన్ని గుర్తించాలన్నారు.

ఐటీఐఆర్ ఉసురు తీసి ఉత్త‌రాల‌తో డ్రామా..

మీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అనేక పర్యాయాలు ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించే ఉద్దేశం లేదు అని బహిరంగ ప్రకటనలు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాలను దాచిపెట్టి, రాష్ట్ర ప్రభుత్వం మీద అబాండాలు వేయడానికి సిగ్గ‌నిపించ‌డం లేదా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అసమర్థత, ఐటీ రంగం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దేశ వ్యాప్తంగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మూలన పడటానికి ప్రధాన కారణం అన్నారు. దానిని కప్పిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం మోప‌డం దుర్మార్గమైన చ‌ర్య‌ అన్నారు. అటు ఐటీఐఆర్ ఉసురు తీసింది మీ పార్టీ, కేంద్రంలోని మీ ప్ర‌భుత్వం కాగా ఇక్కడ ఉత్తరాల పేరుతో డ్రామాలు ఆడుతుందీ మ‌ళ్లా మీరే అని మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

భార‌త ఐటీ రంగంపై స‌మ్మెట పోటు..

గత ఐదేళ్ల పాలనలో ఐటీరంగ అభివృద్ధికి కేంద్రం ఒక్కటంటే ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రకటించకుండా భారతదేశ ఐటీ రంగంపై సమ్మెట పోటు వేసింది నిజం కాదా అని కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ వస్తే కొత్తగా కొలువులు వస్తాయని యువకులు, నిరుద్యోగులు పెట్టుకున్న కోటి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అని ఈ విషయం తెలంగాణలోని ప్రతి ఒక్క విద్యావంతునికి తెలుసన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన నివేదికలు లేకపోవడం వ‌ల్లే ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగిందంటున్న ఎంపీ బండి సంజయ్ కళ్ళు ఉన్న నిజాలు చూడాలేని గుడ్డివాడి లాంటివాడ‌న్నారు. వాస్తవాలను దాచిపెట్టి, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం “ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే” అన్నట్టుగా ఉందన్నారు. బండి సంజయ్ చేతనైతే ఐటీఐఆర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలన్నారు. కేవలం హైదరాబాద్ మీడియాలో ప్రచారం కోసం లేఖలు కాకుండా కేంద్రం నుంచి ఐటీఐఆర్ కు సంబంధించి ఒక ప్రకటన లేదా స్పష్టత ఇప్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

2014 నుంచి రాసిన లేఖ‌లు, డీపీఆర్ ఇచ్చేందుకు సిద్ధం..‌

తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి రాసిన లేఖలతో పాటు ఇచ్చిన డీపీఆర్ ల‌న్నింటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో ఐటీఐఆర్ ప్రాజెక్టు లేదా ఐటీఐఆర్‌కు సమానమైన ఇతర ప్రాజెక్టుని హైదరాబాద్‌కి ప్రత్యేకంగా తీసుకురావాలన్నారు. అటు సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేక కేవలం అసత్యాలు, అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసే బండి సంజయ్ ప్రయత్నాలు ఎన్నడు సఫలం కావన్నారు. ఇప్పటికైనా ఐటీఐఆర్ ను రద్దు చేస్తామని ప్రకటించిన తమ సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటనను మరోసారి చదువుకొని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ నగర యువతకి క్షమాపణ చెప్పాలన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat