అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణల కింద జీన్ క్యారోల్ అనే రచయిత కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1995లో ట్రంప్ తనను అత్యాచారం చేశారని ఆమె ఇదివరకే ఆరోపించారు. ఘటన జరిగి ఎన్నాళ్లైనా బాధితులు కేసు నమోదు చేయొచ్చని ఇటీవల న్యూయార్క్ చట్టాల్లో సడలింపులు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ పై పరువునష్టం దావా వేశారు క్యారోల్.
Read More »రూ.5.65లక్షల కోట్లు నష్టపోయిన జుకర్ బర్గ్
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక సంపద నష్టపోయిన కుబేరునిగా ఫేస్బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ నిలిచాడు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల్లో జుకర్ 20వ స్థానంలో నిలిచాడు. 2014 తర్వాత జుకర్ ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు జుకర్ సంపదలో 71 బిలియన్ డాలర్లు(రూ.5.65 లక్షల కోట్లు) ఆవిరైపోయాయి. కంపెనీ పేరు ‘మెటా’గా మార్చి అందులో పెట్టుబడులు పెరిగాక కంపెనీ …
Read More »ఎలిజబెత్ తాగిన టీ బ్యాగ్ ఎంతనో తెలుసా..?
బ్రిటన్ రాణీ ఎలిజబెత్ II మరణంతో.. ఆమె వాడిన టీబ్యాగ్ ను Ebay అమ్మకానికి పెట్టింది. 1998లో ఎలిజబెత్ ఈ టీ బ్యాగ్ ను వినియోగించారు.. దానిని దాదాపు 12వేల డాలర్లకు Ebay అమ్ముతోంది. అంటే దాదాపు రూ.9.5 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఈ టీ బ్యాగ్ మార్కెట్లో రూ. 5కు దొరుకుతుంది ..కానీ రాణి యూజ్ చేసినందున రూ.9.5లక్షలకు అమ్ముతున్నారు. ఎలిజబెత్ II మరణంతో ప్రపంచ దేశాల ప్రముఖులు …
Read More »రెండో ఎలిజబెత్ కన్నుమూత
బ్రిటన్ దేశపు మహారాణి రెండో ఎలిజబెత్ నిన్న గురువారం కన్నుమూశారు. ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలు. రాణి మరణవార్తను ఆమె నివాస భవనం బకింగ్‌హాం ప్యాలెస్ నిన్న గురువారం రోజు సాయంత్రం ప్రకటించింది. బ్రిటన్‌ను అత్యధిక కాలం (70 ఏండ్లు) పరిపాలించిన మహారాణిగా ఎలిజబెత్ చరిత్రకెక్కారు. రాణి మరణంతో ఆమె కుమారుడు చార్లెస్.. బ్రిటన్‌తోపాటు 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టారు.ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం బకింగ్‌హాం ప్యాలెస్‌కు …
Read More »మరోసారి సంచలనం సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
తాము అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. సైనిక చర్యను ప్రారంభించింది తాము కాదని, దాన్ని అంతం చేసేందుకు …
Read More »చైనాలో మరో కొత్త వైరస్
కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. షాన్డంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి లంగ్యా హెనిపా వైరస్ సోకింది. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు దీని లక్షణాలు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అనేది తేలాల్సి ఉంది. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
Read More »డొనాల్డ్ ట్రంప్ నివాసంపై FBI దాడులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దాడులు చేసింది. ఫ్లోరిడాలోని తన ఇల్లు ప్రస్తుతం FBI ఏజెంట్ల ముట్టడిలో ఉందని ట్రంప్ తెలిపారు. కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. అయితే సోదాల విషయం తెలిసి ట్రంప్ పలు కీలక డాక్యుమెంట్లను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Read More »అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు మళ్లీ కరోనా
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించిన మూడు రోజుల్లోనే.. వ్యాధి మళ్లీ ఆయనకు తిరగబెట్టింది. దీంతో మరోమారు ఆయన ఏకాంతంలోకి వెళ్లారు. అయితే బైడెన్ కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ డాక్టర్ కెవిన్ తెలిపారు.
Read More »గూగుల్ కో-ఫౌండర్ భార్యతో ఎఫైర్? -మస్క్ సంచలన వ్యాఖ్యలు
గూగుల్ కో-ఫౌండర్ సర్జే బ్రిన్ భార్య నికోల్ షనహాన్ తో ఎఫైర్ పై ప్రముఖ వరల్డ్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తాను, బ్రిన్ మంచి స్నేహితులమని, అతడి భార్యను గత మూడేళ్లలో రెండుసార్లే చూశానని చెప్పారు. అప్పుడు కూడా తాము జనాల మధ్యలోనే ఉన్నామని, అలాంటప్పుడు రొమాన్స్ ఎలా చేయగలమంటూ సెటైర్ వేశారు. కాగా నికోల్, మస్క్ ఎఫైర్ కారణంగా బ్రిన్ తన భార్యకు విడాకులు …
Read More »డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూత
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అని ట్రంప్ ట్వీట్ చేశారు. మరణానికి గల కారణాలను పేర్కొనలేదు. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటి మార్గాను ట్రంప్ పెళ్లి చేసుకున్నారు. 1999లో ఆమెను వదిలేసి, 2005లో మెలానియా ట్రంపు పెళ్లాడారు.
Read More »